Stay informed with in-depth breaking U.S. political news and insightful analysis from VoiceOfAmericaNews.com. Our featured AI-POWERED NEWS MONITOR includes a curated feed from authoritative sources such as the White House, FBI, and NSA, highlighting our commitment to monitoring key national broadcasts and upholding democratic values.

NEWS MONITOR

VoiceOfAmericaNews.com Analyzing Key U.S. Broadcasts

ABC NEWS TELUGU//మూడునెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు-టిడిపినుండే మేయర్‌అభ్యర్ధి:గన్ని.

మూడు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు
-ఎవరు అడ్డుకున్నా ఆగవు
-టిడిపి నుండే మేయర్‌ అభ్యర్ధి
-చెప్పినవీ.. చెప్పనవీ కూటమి చేస్తుంది
-చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడుతున్నారు
-కంపెనీలు తెచ్చేందుకు.. ఉద్యోగాల కల్పనకు కృషి
-టిడిపి రాష్ట్ర పధాన కార్యదర్శి గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 31 : రాజమహేంద్రవరం నగర పాలక సంస్ధ ఎన్నికలు మరో మూడు నెలల్లో నిర్వహిస్తారన్న సమాచారం తనకు ఉందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ వెల్లడించారు. స్థానిక గన్నీస్‌ శుభమస్తు కళ్యాణమండపంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ విద్యార్ధుల పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించరాదన్న ఉద్దేశంతో పంచాయితీలు, స్థానిక సంస్ధల ఎన్నికలను పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుందన్నారు. అదే విధంగా స్థానిక సంస్ధల ఎన్నికల అనంతరం కార్పొరేషన్‌ ఎన్నికులను కూడా జరిపించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల జరగకుండా అడ్డుకోవాలని ఎవరూ చూడటం లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూసినా ఎన్నికలు ఆగవన్నారు. 2027లో గోదావరి పుష్కరాలు నేపధ్యంలో నగరపాలక సంస్ధకు పాలకవర్గం ఉంటే బాధ్యతల్లో వారూ కూడా పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మేయర్‌ అభ్యర్ధి విషయంలో కూటమిలోని మంత్రి దుర్గేష్‌, ఎంపి పురంధేశ్వరిలతో కూడా తాను మాట్లాడానని, కూటమి తరపున మేయర్‌ అభ్యర్ధి టిడిపి నుండే ఉండాలన్న అభిప్రాయం వక్తం అయ్యిందన్నారు. అంతిమంగా కూటమి నిర్ణయించిన వారే అభ్యర్ధిగా ఉంటారన్నారు. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో చెప్పినవీ, చెప్పనవీ కూడా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబుడుల తీసుకువచ్చి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లు ఎంతగానో కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకునీ మరీ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారన్నారు. రాష్ట్ర కోసం డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ చాలా కామ్‌గా పనిచేసుకుని వెళుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దాదాపు 60 హామీలను అమలు చేసిందన్నారు. పింఛన్‌దారులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 31వ తేదీనే పింఛన్లు అందించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొత్త పింఛన్లుతో పాటు మహిళలకు నెలకు రూ.1500 ఆర్ధిక సాయం అందించే హామీని త్వరలోనే నెరవేర్చనుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చక్కబెట్టుకుని వస్తుందన్నారు. స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో డజను మందే మిగిలినప్పటికీ ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, చాలా నష్టపోయారన్నారు. 11 సీట్లు పెట్టుకుని తాము అధికారంలోకి వచ్చేస్తామన్న ప్రగల్భాలు పలుకుతున్నారని, తాము అధికారంలోకి వస్తే రప్ఫారఫ్పా నరికేస్తామంటూ డైలాగ్‌లతో ప్రజలను భయబ్రాంతులుకు గురిచేస్తున్నారన్నారు. మాకు ఓటు వేస్తే మీ అంతు తేలుస్తా అన్న రీతిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనలు ఉన్నాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరు అవుతున్నానన్నారు.

Elmer Childress

Related Posts

Bejko: PD nuk është më parti e shpresës!

‘Real Story’ një emision nga gazetari Sokol Balla, çdo të hënë, të martë, të mërkurë dhe të enjte në ekranin e ABC News, ora 20:00. Na ndiqni për më shumë…

Ripërtëritja dhe bomba gjermane/ Hoxha: PD ka nevojë për hapje reale dhe figura të reja

‘Real Story’ një emision nga gazetari Sokol Balla, çdo të hënë, të martë, të mërkurë dhe të enjte në ekranin e ABC News, ora 20:00. Na ndiqni për më shumë…

You Missed

Bejko: PD nuk është më parti e shpresës!

Bejko: PD nuk është më parti e shpresës!

Ripërtëritja dhe bomba gjermane/ Hoxha: PD ka nevojë për hapje reale dhe figura të reja

Ripërtëritja dhe bomba gjermane/ Hoxha: PD ka nevojë për hapje reale dhe figura të reja

Solider surprises brother at his high school graduation after Iran service

Solider surprises brother at his high school graduation after Iran service

South Carolina Democrats Celebrate After Trump Backed Redistricting Fails. Source:ABC News #news

South Carolina Democrats Celebrate After Trump Backed Redistricting Fails. Source:ABC News #news

పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టడం ఎంత వరకు కరెక్ట్..? #pawankalyan #trending #ytshorts #viral

పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టడం ఎంత వరకు కరెక్ట్..? #pawankalyan #trending #ytshorts #viral

They do tho #mrpuzzles #billcypher #vox #caine #true #redwoollegend

They do tho #mrpuzzles #billcypher #vox #caine #true #redwoollegend
©2025 VoiceOfAmericaNews.com